టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదల అయిన తర్వాత తొలి ట్వీట్ చేసారు. “ఈఎస్ఐలో అక్రమాల పేరుతో అక్రమ కేసులో ఇరికించారని ప్రతీ ఒక్కరూ గుర్తించారు. అక్రమ అరెస్టుని ఖండించారు. అనారోగ్యంగా వుంటే కోలుకోవాలని ప్రార్థించారు. ప్రభుత్వం తప్పులు నిలదీయడమే నేను చేసిన తప్పయితే! ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే వుంటాను అని ఆయన ట్వీట్ చేసారు.
సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమకేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే వుంటాను. నిజాయితీ నా ధైర్యం. సత్యం నా ఆయుధం. ప్రజాక్షేమమే నా లక్ష్యం అని ఆయన స్పష్టం చేసారు. ఇక ఇదిలా ఉంటే ఆయనను కలవడానికి టీడీపీ నేతలు ఆయన ఇంటికి వస్తున్నారు. కాసేపటి క్రితం టీడీపీ నేతలు కూడా ఆయన ఇంటికి వచ్చారు. హైదరాబాద్ నుంచి 50 రోజుల తర్వాత వచ్చారు చంద్రబాబు.
ప్రభుత్వం తప్పులు నిలదీయడమే నేను చేసిన తప్పయితే! ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నేను నిలదీస్తూనే వుంటాను. సర్కారు అవినీతిని ప్రశ్నించడమే నేరమైతే ఎన్ని అక్రమకేసులు పెట్టినా నేను ప్రశ్నిస్తూనే వుంటాను. నిజాయితీ నా ధైర్యం. సత్యం నా ఆయుధం. ప్రజాక్షేమమే నా లక్ష్యం.
— Kinjarapu Atchannaidu (@katchannaidu) September 2, 2020