ప‌బ్‌జిని బ్యాన్ చేశార‌ని బెంగ ప‌డ‌కండి.. ఆల్ట‌ర్నేటివ్ గేమ్స్ ఇవిగో..!

-

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ముఖ మొబైల్ గేమ్ ప‌బ్‌జితో స‌హా మొత్తం 118 చైనీస్ మొబైల్ యాప్ ల‌ను నిషేధించిన విష‌యం విదిత‌మే. గ‌తంలో 59 యాప్‌ల‌ను భార‌త్ నిషేధించ‌గా.. ఇప్పుడా జాబితా మ‌రింత పెరిగింది. అయితే ప‌బ్‌జి మొబైల్ ఆడేవారు ఆ గేమ్ అందుబాటులో లేద‌ని దిగులు చెందాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే దానికి ప్ర‌త్యామ్నాయంగా ప‌లు ఇత‌ర గేమ్స్ కూడా వారికి అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే…

1. కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్

ప‌బ్‌జి మొబైల్ గేమ్‌ను దీన్ని అతి పెద్ద ఆల్ట‌ర్నేటివ్ గేమ్‌గా చెప్పుకోవ‌చ్చు. ప‌బ్‌జి లాగే ఇందులోనూ ఆక‌ట్టుకునే మ్యాప్స్‌, వెప‌న్స్‌, గ్రాఫిక్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ఈ గేమ్ అందుబాటులో ఉంది. దీన్ని ఇప్ప‌టికే 100 మిలియ‌న్లకు పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు.

2. షాడో గ‌న్ లెజెండ్స్

మ్యాడ్ ఫింగ‌ర్ గేమ్స్ అనే సంస్థ ఈ గేమ్‌ను డెవ‌ల‌ప్ చేసింది. ఇది కూడా ప‌బ్‌జి లాగే ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంల‌పై ల‌భిస్తోంది.

3. బ్యాటిల్ ప్రైమ్ ఆన్‌లైన్

ఈ గేమ్‌లోనూ ప‌బ్‌జిని పోలిన గ్రాఫిక్స్‌, సౌండ్‌, గేమ్ ప్లే ఉంటాయి. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్లు దీన్ని ఆడ‌వ‌చ్చు.

4. ఇన్ఫినిటీ ఓపీఎస్ సై ఫై

ప‌బ్‌జి గేమ్‌కు ఈ గేమ్‌ను చ‌క్క‌ని ప్ర‌త్యామ్నాయంగా చెప్ప‌వ‌చ్చు. ప‌బ్‌జి లాగే ఇందులోనూ అద్భుత‌మైన మ‌ల్టీ ప్లేయ‌ర్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొంద‌వ‌చ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజ‌ర్లకు ఈ గేమ్ ల‌భిస్తోంది.

5. ఫ్రీ ఫైర్

ప‌బ్‌జి లాగే ఈ గేమ్ కూడా స‌ర్‌వైవ‌ల్ షూట‌ర్ గేమ్‌. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ల‌భిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version