సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో భాగంగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో హెచ్డీఎరాబాద్ మరియు బరోడా జట్లు తలపడుతున్నాయి. మొదట బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టు నిర్ణీత ఓవర్ లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో హైదరాబాద్ ఆటగాళ్లు అందరూ విఫలమైన వేళ కెప్టెన్ తిలక్ వర్మ ఒక్కడే ఆనాటి పోరాటం చేసి జట్టుకు అద్భుతమైన స్కోర్ ను అందించాడు. తిలక్ వర్మ కేవలం 69 బంతుల్లోనే 16 ఫోర్లు మరియు 4 సిక్సుల సహాయంతో 121 పరుగులు చేసి అజేయ సెంచరీ తో జట్టును ఆదుకున్నాడు. ఇప్పటి వరకు టోర్నమెంట్ లో ఆడిన 5 మ్యాచ్ లలో తిలక్ వర్మ అసాధారణ ప్రదర్శనతో అత్యధిక పరుగుల జాబితాలో 271 పరుగులతో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.
కాగా ఇటీవల ఇండియా టీం లో చోటు దక్కించుకున్న తిలక్ వర్మ నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా బరోడా ఈ మ్యాచ్ లో విజయం కోసం పోరాడుతూ ఉంది. దాదాపుగా బరోడా గెలవడం కష్టమే అని చెప్పాలి.