BREAKING : అస్సాం సీఎం ప్రసంగాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ నేత

-

హైదరాబాద్ ఎంజే మార్కెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎం జె మార్కెట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వేదికపై మాట్లాడుతుండగా ఓ టిఆర్ఎస్ నేత అడ్డుకునే ప్రయత్నం చేశాడు. వేదికపై మాట్లాడుతుండగా సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మైకు లాక్కునేందుకు టిఆర్ఎస్ నేత నందు బిలాల్ ప్రయత్నించాడు. దీంతో బిజెపి, టిఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టిఆర్ఎస్ నేత నందును అక్కడ నుంచి తరలించారు పోలీసులు.

కాగా.. కేసీఆర్‌ జాతీయపార్టీపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వాస్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయి.. కెసిఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చన్నారు. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కెసిఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదని విమర్శలు చేశారు. కెసిఆర్ చంద్రుని మీదనో, సూర్యుని మీదనో సముద్రం లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుంటే చేసుకొని.. కెసిఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు అందుకే జాతీయ పార్టీ అని అంటున్నాడని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version