ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 23 కరోనా కేసులు నమోదు కాగా వారిలో ఇద్దరు మాత్రమే కోలుకున్నారు. అందులో తూర్పుగోదావరి 3 అదేవిధంగా ప్రకాశం జిల్లా 3 అత్యధిక కేసులు నమోదయ్యాయి. కాకినాడ రాజమండ్రి లో నేడు రెండు కేసులు బయట పడటంతో ఒక్కసారిగా జిల్లావ్యాప్తంగా అలజడి రేగింది. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడలో కలకలం సృష్టించింది.
కృష్ణలంక చెందిన పానీపూరి వ్యాపారి ఇటీవల మక్కాకు వెళ్లి వచ్చాడు. అతనికి 20 పానీపూరి బండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతనికి కరోనా పరిక్షలు చేయగా అందులో పాజిటివ్ గా వచ్చింది. దీనితో ఒక్కసారిగా కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది అతను ఈ ఎక్కడెక్కడ పానీపూరి బండ్లు నిర్వహిస్తున్నాడు…? అతను రోజు ఎవరిని కలుస్తున్నారు అనేదాని మీద అధికారులు ఆరా తీస్తున్నారు.
అదేవిధంగా అతని కుటుంబ సభ్యులకు, అతని స్నేహితులకు కూడా కరోనా టెస్టులు చేసినట్టు సమాచారం. వారందరినీ ఇప్పుడు వారిని క్వారంటైన్ కి తరలించాలని అధికారులు భావిస్తున్నారు. పానీపూరి వ్యాపారికి కరోనా రావడంతో ఇప్పుడు ఒక్కసారిగా పానీపూరి తిన్న వారిలో కూడా ఆందోళన మొదలైంది. అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు పానీపూరి తిన్న వారిని వేధిస్తున్న ప్రశ్న.