అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్న రోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. మలేషియా ప్రధాని మహతీర్ మహ్మద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని పదవికి తక్షణమే రాజీనామా చేస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఇటీవల భారత్ అంతర్గత విషయాలపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇవి వివాదాస్పదం కూడా అయ్యాయి. ప్రపంచంలోనే వయసులో అతిపెద్ద ప్రధానిగా ఆయనకు గుర్తింపు ఉంది.
2018 మేలో మలేసియా ప్రధాని బాధ్యతలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే ఆయన రాజీనామా చేస్తూ అనూహ్యంగా నిర్ణయం వెల్లడించారు. తన రాజీనామా లేఖను ఆయన ఆ దేశ రాజుకి పంపించారు. ఇక ఆయన త్వరలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక త్వరలో ఎన్నికలు నిర్వహిస్తారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది.
దీనిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. ఆయన తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. నిర్వహిస్తే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది తెలియదు. అయితే ఆయన భారత్ పై చేసిన వ్యాఖ్యలే రాజీనామా కు కారణం అయ్యాయి అని అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడే రాజీనామాకు కారణమని అంటున్నారు. కాశ్మీర్ విషయంలో కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు వచ్చిన రోజే ఆయన రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.