బ్రేకింగ్: అయోధ్యకు బయల్దేరిన ప్రధాని

-

అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి అయోధ్య బయల్దేరారు. 11 గంటల 30 నిమిషాలకు ఆయనకు అయోధ్య చేరుకుంటారు. 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు ఆయన భూమి పూజ చేయనున్నారు. 12 గంటలకు భూమి పూజ చేసే స్థలానికి ఆయన వెళ్తారు. మొత్తం 3 గంటల పాటు ఆయన అయోధ్యలో పర్యటిస్తారు.

32 సెకన్ల లో క్రతువు పూర్తి కానుంది. ప్రధాని చేతుల మీద 40 కేజీల ఇటుక శంకుస్థాపన చేయనున్నారు. బయటి వ్యక్తులకు లోపలి ప్రవేశం లేదు అని అధికారులు స్పష్టం చేసారు. లౌడ్ స్పీకర్ ల ద్వారా భూమి పూజ సమయంలో రాముడి పాటలను ప్లే చేస్తారు. ముందు ప్రధాని హనుమాన్ గడీ ఆలయంలో పూజలు చేస్తారు. 175 మంది ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version