సంప్రదాయానికి స్వస్తి.. సైనిక యూనిఫారంలో కింగ్‌ ఛార్లెస్‌-3 పట్టాభిషేకం..?

-

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3, కెమిల్లా దంపతుల పట్టాభిషేక మహోత్సవం ఈ ఏడాది మే నెల 6న అధికారికంగా జరగనుంది. ఈ మహోత్సవంలో శతాబ్దాల సంప్రదాయానికి స్వస్తి పలకాలని కింగ్ ఛార్లెస్-3 భావిస్తున్నారట. అదేంటంటే.. పట్టాభిషేక సమయంలో రాజ దుస్తులను ధరించే ఆచారానికి ఆయన దూరంగా ఉండనున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ఇండిపెండెంట్‌’ వెల్లడించింది.

మునుపటి పట్టాభిషేకాల్లో చక్రవర్తులు సంప్రదాయబద్ధంగా పట్టు దుస్తులు ధరించేవారు. ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టాలని కింగ్‌ ఛార్లెస్‌-3 తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాజ దుస్తులకు బదులుగా సైనిక యూనిఫారంలో పట్టాభిషేకానికి హాజరయ్యే అవకాశం ఉంది. సీనియర్‌ సలహాదారులను సంప్రదించిన తర్వాత కొత్త చక్రవర్తి ఈ నిర్ణయానికి వచ్చారని బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

సంప్రదాయ దుస్తులు కాలం చెల్లినవిగా భావించడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. వెస్ట్‌మినిస్టర్‌ అబేలో ఈ వేడుకను వైభవంగా నిర్వహించనున్నారు. తర్వాతి రోజు విండ్సర్‌ క్యాజిల్‌లోనూ పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు పెద్దఎత్తున జరుపుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version