బ్రిట‌న్ ప్ర‌ధాని రిషి సునాక్‌ పై విమ‌ర్శ‌లు…

-

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టిన రోజు నుండి ఆయన పై విమర్శలు, వివాదాలు వినిపిస్తునే ఉన్నాయి. తాజాగా మరోసారి రిషి సునాక్‌ వివాదాస్పద వార్తలో నిలిచారు. కేవలం వారం రోజుల వ్యవధిలో విమాన ప్రయాణాలపై 5 లక్షల పౌండ్లు ఖర్చు చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై విమర్శలు వస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన గతంలో ఇచ్చిన హామీలకు ఇది పూర్తి విరుద్ధమని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసావసరాలు తీరక ప్రజలు అలమటిస్తుంటే అధికార పక్షం పన్నుల సొమ్మును వృథా చేస్తోందని మండిపడ్డారు. బ్రిటన్ ప్రధాని ప్రయాణ ఖర్చులపై ప్రభుత్వ గణాంకాల ఆధారంగా గార్డియన్ పత్రిక ఇటీవల ప్రచురించిన కథనం ప్రస్తుతం బ్రిటన్‌లో కలకలం రేపుతోంది.

ఆయ‌న విదేశీ టూర్ల కోసం సుమారు 5 ల‌క్ష‌ల యూరోలు ఖ‌ర్చు అయిన‌ట్లు లిబ‌ర‌ల్స్ పార్టీ ఆరోపిస్తున్న‌ది. ప్రైవేటు విమానాల్లో వెళ్ల‌డం వ‌ల్లే ఆ ఖ‌ర్చు అయిన‌ట్లు అనుమానిస్తున్నారు. ప‌న్నుదారుల డ‌బ్బును దుర్వినియోగం చేసిన‌ట్లు ఆ పార్టీ వెల్లడించింది.
గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఈజిప్టు లో జ‌రిగిన కాప్‌27 స‌ద‌స్సుకు రిషి సునాక్ వెళ్లారు. అయితే ఆ ట్రిప్‌కు ల‌క్షా 8 వేల యూరోలు ఖ‌ర్చు అయిన‌ట్లు సమాచారం. తరువాత ఇండోనేషియాలోని బాలిలో జ‌రిగిన జీ20 స‌ద‌స్సుకు వెళ్లినందుకు 3 ల‌క్ష‌ల 40 వేల యూరోలు ఖ‌ర్చు అయ్యింది. ఇక లాత్వియా, ఇస్టోనియా ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో 62 వేల యూరోలు ఖ‌ర్చు అయింది. ప్ర‌స్తుత సంక్షోభ ప‌రిస్థితుల్లో ప‌న్నుదారుల డ‌బ్బును వృధా చేసిన‌ట్లు లిబ‌ర్ డెమోక్రాట్లు తెలియపరిచారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version