#BroTeaser Tomorrow at 5:04PM pic.twitter.com/TIG5DGqGAf
— Manobala Vijayabalan (@ManobalaV) June 28, 2023
పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ లు నటిస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో… ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయిన వినోధయ సీతం కు రీమేక్ అని తెలిసిందే. ఈ సినిమాను విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వునేనభుందు లేటెస్ట్ గా అద్భుతమైన అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా టీజర్ ను రేపు సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయనుంది. దీనితో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కాగా ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కూడా పెన్ సాయం చేస్తున్నారు. మరి ఈ సినిమా నుండి రానున్న టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా తెలియాలంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.