కుక్కను చంపారని పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు, తీరికగా తిరిగి వచ్చిన కుక్క…!

-

కొంత మందికి ఏదైనా చేసే సమయంలో లాజిక్ లు ఉండవు అంటారు. ఇలాంటి సంఘటనే తెలంగాణాలోని నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఒక తండాలో కుక్క గురించి అన్నా దమ్ములు ఒకరి మీద ఒకరు దాడి చేసారు. ఎవరు విడదీసే ప్రయత్నం చేసినా సరే వాళ్ళు మాత్రం ఆగలేదు. అసలు ఏం జరిగింది అంటే… బీమ్లా తండాలో ఒక వ్యక్తి కుక్క కనపడకుండా పోయింది.

దాని కోసం ఎంత వెతికినా సరే అది దొరకలేదు. పక్క ఊరు లో కూడా దాని కోసం వెతికారు. అయినా సరే అది మాత్రం దొరకలేదు. దీనితో తన కుక్కను తన తమ్ముడే చంపాడు అని భావించిన అన్న వెళ్లి తమ్ముడి మీద దాడికి దిగారు. నాకు సంబంధం లేదు అని చెప్పినా సరే వినలేదు. ఒకరి తలలు ఒకరు పగలకోట్టుకునే వరకు వెళ్ళారు. మధ్యలో గ్రామస్తులు విడదీసినా సరే…

వాళ్ళు మాత్రం ఆగలేదు. ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా సరే కుక్కను చంపారని దాడులకు దిగారు. ఈ దాడిలో తీవ్ర గాయాలు అయ్యాయి ఇరు వర్గాలకు. వీళ్ళు గొడవ పడుతున్న సమయంలోనే కుక్క తిరిగి వచ్చింది. ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తూ కొందరి మీద హత్యానేరం మోపినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version