కలియుగ ద్రౌపది.. ఇప్ప‌టికీ ఉన్నారండోయ్‌.. ఎక్క‌డంటే..?

-

మహాభారతం గురించి కాస్తో కూస్తో ఐడియా ఉన్నవారందరికీ ద్రౌపది అన్న పేరు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇక ద్రౌప‌ది అని చెప్ప‌గానే గుర్తుకువ‌చ్చేది.. ఆమెకు ఐదుగురు భ‌ర్త‌లు. అవును..! హిందూ మత పురాణం మహాభారతంలో ఐదుగురు పాండవులకు ఉమ్మడి భార్య ద్రౌపది. అయితే ఇప్పటికే అలాంటి కలియుగ ద్రౌపదులు ఉన్నారంటే ఎవరైనా నమ్ముతారా..? అది కూడా మనదేశంలోనే. ఒక ఇంట్లో అన్నదమ్ములందరినీ ఒకే ఒక్క అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. ఈ సాంప్రదాయం హిమాచల్ ప్రదేశ్ లోని శివారు ప్రాంతాల్లో నివసించే కుటుంబాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది.

అయితే దీనికి ఓ ప్ర‌ధాన కార‌ణం కూడా ఉందండోయ్. ఆ ప్రాంతాల్లో ప్రజలంతా వ్యవసాయ భూమిపైనే ఆధారపడి జీవిస్తుంటారు. ఎంత లేదనుకున్నా ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు మగపిల్లలు ఉంటారు. వారంతా ఒక్కొక్కరు ఒక్కో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కుటుంబ పోషణ భారంగా మారుతుందని వారి భావనట. అందుకే ఇలా ఇంట్లో కొడుకులందరికీ ఒకే అమ్మాయితో పెళ్లి చేస్తార‌ట‌. ఇక్క‌డ మ‌రో విశేషం ఏంటంటే.. ఈ సాంప్ర‌దాయం వల్ల ఇప్పటివరకు తమకు ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని వారు చెబుతుండటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version