విచారణ పూర్తి అయ్యే వరకు రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. గురువారం ఆంధ్రప్రదేశ్ రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు అంశంపై హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జీకే మహేశ్వరీ మాట్లాడుతూ, బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ ని ప్రశ్నించగా,
మండలికి వెళ్లి సెలెక్ట్ కమిటి పరిధిలో ఉన్నాయని చెప్పారు. దీనితో బిల్లులపై ఏ విధమైన విచారణ అవసరం లేదని సీజీ అన్నారు. వెంటనే స్పందించిన పిటీషనర్ల తరుపు న్యాయవాది అశోక్… ఈ అంశంపై విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారని కోర్ట్ కి తెలియజేస్తూ విచారణ జరపాలని విజ్ఞప్తి చేసారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టీస్ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు.
విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాలు తరలించకూడదని, తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేసారు. తదుపరి విచారణను తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేసారు. తమ ఆవేదన న్యాయమూర్తి విన్నారని తమకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీనితో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లు అయింది.