అదానీపై జేపీసీ వేయండి.. పార్లమెంట్​లో BRS వాయిదా తీర్మానం

-

అదానీ సంస్థ‌ల‌పై హిండెన్‌బ‌ర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆ కంపెనీపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పార్లమెంట్​లో ఇవాళ ఉభ‌య‌స‌భ‌ల్లో బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రూల్ 267 కింద రాజ్య‌స‌భ‌లో చ‌ర్చ చేప‌ట్టాల‌ని చైర్మ‌న్ ధ‌న్‌క‌ర్‌ను ఎంపీ కేశ‌వ‌రావు కోరారు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను వాయిదా వేసి.. అదానీపై జేపీసీ వేయాల‌న్న అంశాన్ని డిస్క‌స్‌ చేయాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లో తెలిపారు.

లోక్‌స‌భ‌లోనూ ఇదే అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వ‌ర‌రావు డిమాండ్ చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను నిలిపివేసి.. అదానీ అంశంపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని వాయిదా తీర్మానంలో డిమాండ్ చేశారు.

పార్ల‌మెంట్ రెండో విడత బ‌డ్జెట్ స‌మావేశాల‌ు సోమవారం రోజున ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. తొలి రోజు కూడా బీఆర్ఎస్ నేత‌లు వాయిదా తీర్మానం ఇచ్చారు. అదానీ వ్య‌వ‌హారంపై చ‌ర్చించాల‌ని లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లోనూ కోరారు. ఈడీ, సీబీఐల‌ను దుర్వినియోగం చేస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం ముందు ధ‌ర్నా చేప‌ట్టిన విష‌యం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version