పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే తల్లిదండ్రులుగా కఠినంగా ఉంటున్నట్టే..

-

పిల్లలకు స్కూలుకు వెళ్లే వయసు వచ్చినప్పటి నుండి తల్లిదండ్రులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల పట్ల మరీ కఠినంగా ఉండకూడదు. మీరు కఠినంగా ఉన్నట్లయితే పిల్లల్లో చాలా మార్పులు వస్తాయి.

తల్లిదండ్రులు కఠినంగా ఉండటం వల్ల పిల్లల్లో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏంటో చూద్దాం.

విషయాలను దాస్తారు:

మీరు కఠినంగా ఉన్నట్లయితే పిల్లలు చాలా విషయాలను మీకు చెప్పకుండా దాచేస్తారు. చెబితే మీరు ఏమంటారోనన్న భయం వాళ్లలో ఉండటంవల్ల మీకు ఏదీ చెప్పరు.

తమ మీద తమకు నమ్మకం లేకపోవడం:

ప్రతీసారి పిల్లలను నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడుతుంటే పిల్లలు తమ మీద నమ్మకాన్ని కోల్పోతారు. వాళ్లలో కాన్ఫిడెన్స్ బాగా తగ్గిపోతుంది. నీవల్ల ఏమీ కాదు, నీకు ఏమీ చేతకాదు అనే మాటలు పిల్లలతో అనకపోవడమే మంచిది.

ఎదురు తిరిగే గుణం:

మీరు మరీ కఠినంగా ఉండడం వల్ల పిల్లలు మీకు ఎదురు తిరుగుతారు. ఎదురు తిరిగితే తప్ప స్వేచ్ఛ లేదన్న నమ్మకానికి వాళ్లు వచ్చేస్తారు. ఇంతకుముందు మామూలుగా ఉన్న పిల్లలు తాజాగా ఎదురు తిరుగుతున్నారంటే మీరు వాళ్ళ పట్ల కఠినంగా ఉంటున్నారని అర్థం.

ఒంటరిగా ఉంటారు:

పిల్లల్ని పదేపదే తిడుతూ ఉండడం వల్ల పిల్లలకు స్నేహితులతో కలవాలనే కోరిక తగ్గిపోతుంది. ఇప్పుడు ఏదో ఆలోచిస్తూ ఒంటరిగా ఉంటారు.

పనిచేసే తత్వాన్ని కోల్పోతారు:

నీకు చదవడం రాదు, ఆటలాడటం రాదు లాంటి మాటలు మాట్లాడటం వల్ల ఏదైనా చేయాలనే ఆలోచన వారు కోల్పోతారు. ఏమీ చేయకుండా డల్లుగా కూర్చుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version