తెలంగాణ రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారించడం.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేయడం.. సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేయడం ఇలా అన్ని బీఆర్ఎస్ కి నెగిటివ్ గా జరుగుతున్నాయని ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీఆర్ఎస్ నేతలు డైవర్ట్ రాజకీయాల కోసమే తమను అరెస్ట్ చేయాలని కుట్ర పన్నుతున్నారని పేర్కొంటున్నారు. కక్ష పూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడి ఓ క్లారిటీ ఇచ్చాడు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎవ్వరిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. ఆనాటి కార్యక్రమాలను గొప్పలు చేశామని మంత్రులు చెబుతున్నారు. అప్పుడున్న అధికారులు వారే ఒప్పుకుంటున్నారు తప్పు జరిగిందని.. వారు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు. వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనో, తప్పుడు కేసులు బనాయించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతూ ఉంది. ఒకరోజు ముందో ఆలస్యమో చట్టం ప్రకారమే ప్రభుత్వం చేస్తుందన్నారు మంత్రి పొంగులేటి.