బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ పై సీతక్క చేసిన కామెట్స్ కు బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత కౌంటర్ ఇచ్చారు. సీతక్క నువ్వు ఆదివాసీ బిడ్డ అనే కార్డు వాడుకొని కేటీఆర్ గారి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు.

సీతక్క ఎన్నికల ముందు స్వాతిముత్యంలో కమల్ హాసన్ లాగా అమాయకంగా మొహం పెట్టుకోని ఓట్లు అడిగి.. గెలిచాక మొత్తం క్యారెక్టర్ మార్చేసిందని ఫైర్ అయ్యారు. నువ్వు నిజంగా ఆదివాసీ బిడ్డ అయితే జీవో 49 ఎందుకు రద్దు చేయడం లేదు? ములుగు నియోజకవర్గంలో జరిగే అక్రమాలను చూపిన జర్నలిస్టును నీ అనుచరులతో కొట్టించలేదా? అని నిలదీశారు. నీ అనుచరుల ఒత్తిడి వల్ల ఇందిరమ్మ ఇళ్ల గురించి ప్రశ్నించే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోలేదా? నీకు మావోయిస్టులు లేఖ రాయడం నిజం కాదా? అని నిలదీశారు బీఆర్ఎస్ నాయకురాలు మాలోత్ కవిత.