ఓ టీవీ చర్చలో కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ పై BRS నేత దాడి !

-

ప్రముఖ టీవీ చర్చలో భాగంగా… గులాబీ పార్టీ అలాగే కాంగ్రెస్ నాయకులు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతపై గులాబీ పార్టీకి సంబంధించిన ఓ నేత దాడి కూడా చేశాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

TV
BRS leader attacks Congress leader Devani Satish in a TV debate

ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కేటీఆర్ వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య చాలెంజ్ సవాల్ ఇవాళ ఉదయం నుంచి కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఓ ప్రముఖ ఛానల్ టీవీ చర్చలో భాగంగా కాంగ్రెస్ అలాగే గులాబీ, ఇతర పార్టీల నేతలను పిలిచారు. ఈ సందర్భంగా మాట మాట పెరిగి టీవీ చర్చలో… కాంగ్రెస్ నాయకుడు దేవని సతీష్ పై గౌతమ్ ప్రసాద్ దాడి చేశారు. గౌతమ్ ప్రసాద్ గులాబీ పార్టీకి సంబంధించిన నేతగా తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news