పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలు కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే…పీర్జాదిగూడలో భారీ నిర్మాణాలు కూల్చివేతలు అవుతున్న తరుణంలో అడ్డుకున్నారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. అయితే.. వారిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని సర్వే నం 1లో ఉన్న భారీ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు అధికారులు.
అయితే.. కూల్చివేత అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్ కావడం జరిగింది. అటు మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై మండిపడ్డారు పీర్జాదిగుడా మేయర్ జక్క వెంకట్ రెడ్డి. పీర్జాదిగుడాను కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి కోసం సీలింగ్ భూముల పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన అల్లుడు అమర్ సింగ్ ను మేయర్ చేయాలని, అక్రమాస్తులను కూడబెట్టుకోవాలని కుట్రలో భాగమే ఈ కూల్చివేతలు అంటూ నిప్పులు చెరిగారు.