త్వరలో బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో దళిత సదస్సు : కేసీఆర్‌

-

జాతీయ పార్టీని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ పార్టీని ప్రజల్లోకి, ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్లేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా కేసీఆర్ తో కలిసి నడిసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను వివిధ రాష్ట్రాల నేతలు కలిశారు. వారిలో తమిళనాడు వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ ఉన్నారు.

బీఆర్​ఎస్ ఏర్పాటు చేసినందుకు కేసీఆర్​కు నేతలు అభినందనలు తెలిపారు. ఎస్సీల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని కేసీఆర్ వారికి వివరించారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. త్వరలో బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో దళిత సదస్సు నిర్వహిస్తామని కేసీఆర్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న దళిత సోదరులందరిని ఈ సదస్సుకు ఆహ్వానిస్తామని తెలిపారు.

తెలంగాణలో ఎస్సీ పథకాల గురించి తెలుసుకున్నామని వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ అన్నారు. ఎస్సీలకు ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు కావట్లేదని తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న దళితబంధు గొప్ప పథకమని తిరుమావళవన్ కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version