ఏపీ ప్రభుత్వం తప్పుడు ఫిర్యాదులు చేసింది : శ్రీనివాస్ గౌడ్

-

పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పాలమూరు, రంగారెడ్డి ద్వారా 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అయితే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదు. డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి ఇచ్చింది. బిఆర్ఎస్ హయాంలోనే పాలమూరు, రంగారెడ్డి ట్రయల్ రన్ పూర్తి అయింది.

ఏపీ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డిపై కృష్ణా ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకు చెందినవాడు. పాలమూరు పేరు చెప్పుకుని డబ్బులు తెచ్చుకుని జిల్లాను ఉమ్మడి రాష్ట్రంలో ఎండబెట్టారు. పాలమూరు జిల్లా నుండి 14 లక్షల మంది వలసలు వెళ్లారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పంపిన డీపీఆర్ కు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది. నాగార్జున సాగర్ ఎగువున ఉన్న 45 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని తీర్పు ఉంది. 90 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు ఉన్నాయి. కానీ క్రిష్ణా ట్రిబ్యునల్ లో ఏపీ ప్రభుత్వం తప్పుడు ఫిర్యాదులు చేసింది. తెలంగాణకు రావాల్సిన మూడు అనుమతులను ఏపీ ప్రభుత్వం ఆపింది అని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version