డ్యూటీ ఫ్రీ లిక్కర్ ను బ్లాక్ లో అమ్ముతున్న పోలీసులు పట్టుబడ్డారు. ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొని.. బ్లాక్ లో బయట వ్యక్తులకు అమ్ముతున్నారు ఒక కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డ్. అయితే ఈ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. వారి వద్ద నుండి 15 లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇక ఈ ఘటనలో మొత్తం ఐదుగురి పైన కేసు నమోదు చేసారు.
అయితే వీఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ లో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు ఈ కానిస్టేబుల్, హోంగార్డు. అప్పుడు ఎయిర్పోర్టులో ఉండే డ్యూటీ ఫ్రీ లిక్కర్ దుకాణాల నుంచి మద్యాన్ని పలువురు ప్యాసింజర్ల పేరుతో కొనుగోలు చేస్తున్నారు కానిస్టేబుల్ జెమ్యా నాయక్, హోమ్ గార్డ్ బండారి లింగయ్య. అక్కడే డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ కౌంటర్ లో పనిచేస్తున్న మహేష్ తో కలిసి దందా మొదలు పెట్టారు. ఇక వీరి నుండి మొత్తం 41 లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.