మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం భారతదేశ ప్రజలకు తీర్చలేనటువంటి లోటు. 1991లో పివి నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక శాఖ మంత్రి నియమించారు. 15 టన్నుల బంగారాన్ని కుదవపెట్టి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చారు. భారతదేశ ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో ప్రధానిగా పీవీ నరసింహారావు, ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ వచ్చారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి గల ముఖ్యకారకుడు మన్మోహన్ సింగ్.
ఆ ఐదు సంవత్సరాలు ఆర్థిక ఇబ్బందులను బయటపడి ప్రగతి పథంలో ముందుకు వెళ్ళింది. మన్మోహన్ సింగ్ అంటేనే సంస్కరణలకు పెట్టింది పేరు. దేశం ఒక మహా నేతను కోల్పోయింది. మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన సంస్కరణల అడుగుజాడల్లోనే తదుపరి వచ్చిన ప్రధాన మంత్రులు నడుచుకున్నారు. మన్మోహన్ సింగ్ ను గొప్ప ప్రధానిగా గుర్తించి ఆయన సేవలను అందరూ తలచుకుంటున్నారు అని మల్లు రవి పేర్కొన్నారు.