సల్వాజీ మాధవ్ రావును పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు..!

-

సల్వాజీ మాధవ్ రావును బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఇక వివరాల లోకి వెళితే..
పోలీసులు అక్రమ కేసులు పెట్టి, కరీంనగర్ జైల్లో పెట్టిన ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల వాస్తవ్యులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంఛార్జి సల్వాజీ మాధవ్ రావును బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.

ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, మాజీ కోరుకంటి చందర్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ కూడా సల్వాజీ మాధవ్ రావును పరామర్శించారు. అలానే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త సల్వాజీ మాధవరావు మీద చేసిన దాడికి నిరసనగా ధర్మారం చౌరస్తాలో ధర్నా చేశారు బీఆర్ఎస్ శ్రేణులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version