కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అవుతుందని వస్తున్న వార్తలు అన్నీ ఊహగానాలే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోకి మిగతా ఎమ్మెల్యేలు ఎలా వెళతారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ఎల్పీ విలీనమవుతుందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పార్టీ వైఖరిని ఈ నెల 17న ఖరారు చేస్తామన్నారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తలసాని వెల్లడించారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయం తీసుకుందని, మా వ్యూహాలు మాకుంటాయని తెలిపారు.