కడప జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులు లక్ష్మీ మౌనిక, సుధీర్ కుమార్ రెడ్డిలను ఆశీర్వదించారు మాజీ సీఎం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక అటు జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది… టీడీపీలో చేరారు వైసీపీ మాజీ మంత్రి. తాజాగా టీడీపీలో చేరారు మాజీ మంత్రి ఆళ్ల నాని. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు మాజీ మంత్రి ఆళ్ల నాని. ఈ సందర్బంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.