ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

-

బీఆర్​ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈనెల 10 చెన్నై వెళ్లనున్నారు. 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై ఓ సంస్థ నిర్వహించే చర్చలో కవిత పాల్గొననున్నారు. ఈ చర్చలో బీఆర్ఎస్ జాతీయ ఎజెండాను వివరించనున్నారు.

ఈ చర్చలో కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచిశివ, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ వల్లభ్‌ పాల్గొంటారని సమాచారం. ఆ వేదిక ద్వారా దళితబంధు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత, కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కవిత ప్రసంగించనున్నట్లు సమాచారం.

ఇప్పటికే జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. బీఆర్ఎస్​ను అన్ని రాష్ట్రాల్లోకి తీసుకువెళ్లేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్రలోని నాందేడ్​లో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. మహారాష్ట్ర వ్యాప్తంగా వారం, పది రోజుల్లో ఇంటింటికి బీఆర్​ఎస్ ప్రచారం ప్రకటించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్​ఎస్​కు అవకాశం ఇవ్వాలని కోరారు. త్వరలోనే ఒడిశా, కర్ణాటకల్లోనూ సభ నిర్వహించే అవకాశాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version