వైయస్సార్ కళ్యాణమస్తు షాదీతోఫా పథకం ఆర్థిక సాయం ఈనెల 10 న ప్రభుత్వం విడుదల చేయనుంది. సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గతేడాది అక్టోబర్ 1 నుంచి 31 మధ్యాహ్నం మ్యారేజ్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతలకు ఈ ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
పూర్తి వివరాల్లోకి వెళితే,
- ఎస్సీ వివాహాలకు రూ.లక్ష, కులాంతరమైతే రూ.1.20 లక్షలు
- ఎస్టి వివాహాలకు రూ.లక్ష, కులాంతరమైతే రూ. 1.20 లక్షలు
- బిసి వివాహానికి రూ. 50,000, బీసీ కులాంతర వివాహానికి రూ.75000
- మైనార్టీల వివాహానికి రూ. లక్ష
- దివ్యాంగుల వివాహానికి రూ. 1.50 లక్షలు
- భవన నిర్మాణ కార్మికుల వివాహానికి రూ. 40 వేల సాయం చేస్తారు.