కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా రైతులను మోసం చేసిందని పేర్కొంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రైతుమహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నల్గొండ జిల్లాలోని క్లాక్ టవర్ వేదికగా ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు హాజరు కానున్నారు.
రైతు మహా ధర్నాలో పాల్గొనేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చే అవకాశం ఉంది.మహా ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను బీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.ధర్నాలో జిల్లాలోని రైతులకు చేయాల్సిన రుణమాఫీ చేసిన రుణ మాఫీ, రైతుభరోసా కింద 3 విడతల్లో అందించాల్సిన పెట్టుబడి సాయంపై సర్కార్‌ను నిలదీయనున్నారు.