బీఆర్ఎస్ సభకు పైసలెక్కడివి.. కూలిన కాళేశ్వరం కమీషన్ సొమ్మేనా? : ఎంపీ చామల

-

బీఆర్ఎస్ సభను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పైసలెక్కడివి అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ఒక రాజకీయ పార్టీ ఒక మాదిరి సభ పెట్టాలంటే ఖర్చులు భరించలేక నాయకుల నరాలు తెగుతాయ్. రూపాయి రూపాయి పోగేసి సభను సక్సెస్ చేస్తే చాలు… అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. అందులోనూ ప్రతిపక్షంలో ఉండి సభ నిర్వహించాలంటే ఎంత నరకమో చెప్పనక్కర్లేదు..

కానీ,బీఆర్ఎస్ వరంగల్ సభ ఏర్పాట్లు చూస్తుంటే కళ్లు చెదురుతున్నాయి.వందల కోట్లు ఖర్చు చేస్తే తప్ప ఆ రకంగా సభ పెట్టడం సాధ్యం కాదు. జనాన్ని ఎంత మందిని తోలుతారు… ఆ పనికి ఎంత ఖర్చు చేస్తారు అన్నది వేరే విషయం. సభ ఏర్పాటు తీరే కళ్లు బైర్లు కమ్మేలా ఉంది. ఆ వేదిక, హంగామా, ఆర్భాటం చూస్తుంటే ఊహకందనంత ఖర్చు అయ్యుంటుందని సామాన్యుడికి కూడా అర్థమవుతోంది.ఎక్కడిది ఈ డబ్బు.. కూలిన కాళేశ్వరం కమీషన్ సొమ్మా..?

మిషన్ భగీరథ పేరుతో పాత ట్యాంకులకు రంగులు వేసి… పాత తాగునీటి పథకాలను లింక్ చేసి దోచిన సొమ్మా..? హైదరాబాద్ బిల్డర్ల దగ్గర పర్మిషన్ల కోసం వసూలు చేసిన “అదనపు ఫ్లోర్ల” కమీషన్ సొమ్మా..? ఫార్ములా కార్ రేస్ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు దోచిన సొమ్మా..!? ధరణి పేరుతో అర్ధరాత్రులు భూ హక్కులను మార్చేసి దోచిన వేల ఎకరాల దోపిడీ సొమ్మా…!?

కానామెట్, నియోపోలీస్, కోకాపేట్ లలో వేల కోట్ల విలువ చేసే భూములను వేలం పేరుతో ఐనవారికి దోచిపెట్టడం ద్వారా సంపాదించిన సొమ్మా…!? లక్షల కోట్ల విలువ చేసే ఔటర్ రింగ్ రోడ్డును కేవలం రూ.7000 కోట్లకు 33 ఏళ్ల పాటు ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేయడం వల్ల వచ్చిన “కిక్ బ్యాక్” సొమ్మా… !? రెండు గంటల సభ కోసం ఖర్చు చేస్తోన్న ఈ వందల కోట్ల ధన్ ప్రవాహం … ఏ కమీషన్ల తాలుఖాదో తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news