ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు కొంత చిన్న చూపు ఉందనేది వాస్తవం. కానీ, ఇటీవలి కాలంలో ప్రైవేట్ ఆస్పతులతో పోలిస్తే ప్రభుత్వ ఆస్పత్రులే మెరుగ్గా చికిత్స అందిస్తున్నాయేది కాదనలేని సత్యం.గత ప్రభుత్వం రాష్ట్రంలో జిల్లాలో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసింది. ఫలితంగా ఆస్పత్రులు పేదప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఇతర అధికారులకు భిన్నంగా, నలుగురికి ఆదర్శంగా నిలిచారు. ఆయన భార్య విజయ శనివారం గోదావరిఖనిలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో ప్రసవించారు.రాత్రి పురిటి నొప్పులు రావడంతో వైద్యులు ఆపరేషన్ చేయగా ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.తన భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కలెక్టర్ ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించారు.దీంతో ఈ దంపతులపై ప్రశంసలు కురుస్తున్నాయి.