బీఆర్ఎస్ సభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్డీవో.. తీవ్ర ఉద్రిక్తత

-

నేడు హన్మకొండలోని ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు వేలాదిగా తరలివెళ్తున్న బస్సులను పోలీసులు, ఆర్డీవో అడ్డుకుంటున్నట్లు తెలిసింది. ఖమ్మం – తిరుమలాయపాలెం వరంగల్ రోడ్డు పై బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవసభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుంటున్న ఆర్టీవో, పోలీసులు అడ్డుకోవడంతో గులాబీ శ్రేణులు వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని ఆర్టీవో, సిబ్బందిపై ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం కావాలని కక్ష పూరిత చర్యలకు పాల్పడుతోందని వారు ఫైర్ అయ్యారు.ఇటువంటి చర్యలకు పాల్పడటం తగదని బీఆర్ఎస్ సీనియర్ నేతలు విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news