వరంగల్ రజతోత్సవ సభ సూపర్ సక్సెస్ కావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. రజతోత్సవ సభకు లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు రావడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణపై, మాజీ సీఎం కేసీఆర్ మీద అచంచల విశ్వాసాన్ని చూపించిన ప్రజలకు ధనవాదాలు తెలిపారు.
‘దేశ చరిత్రలో అతిపెద్ద రాజకీయ సమావేశాలలో ఒకటైన బీఆర్ఎస్ రజతోత్సవ సమావేశాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసి, దోష రహితంగా నిర్వహించారు.రాష్ట్ర పోలీసుల ట్రాఫిక్ నిర్వహణ లోపం కారణంగా లక్షలాది మంది వేదిక వద్దకు చేరుకోలేకపోయినప్పటికీ, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల శక్తి ఈ సమావేశంలో పూర్తిగా ప్రదర్శించబడింది. ఈ కార్యక్రమాన్ని నిజంగా చారిత్రాత్మకమైనదిగా, అద్భుతమైన విజయంగా మార్చినందుకు తెలంగాణ ప్రజలు,నిర్వాహకులు, BRS నేతలకు,కేడర్‌కు, సోషల్ మీడియా యోధులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అద్భుతమైన కవరేజ్ ఇచ్చిన మీడియా సోదరులకు ధన్యవాదాలు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.