భారత ప్రధాని మోడీ వచ్చే నెల ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు.ఇప్పటికే ఆయన అమరావతి టూర్ ఫిక్స్ అయ్యింది. అయితే, ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా ప్రధాని మోడీ అమరావతి పర్యటనలో స్వల్ప మార్పులు చేశారు.
జమ్ముకాశ్మీర్ ఉగ్రదాడి ఘటన దృష్ట్యా ప్రధాని మోడీ రోడ్ షోను రద్దు చేసుకున్నారు.కేవలం కారులో నుంచి ప్రజలకు ఆయన అభివాదం చేయనున్నట్లు తెలుస్తోంది.ఇదిలాఉండగా, మే 2న రాజధాని అమరాతి పునః నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరుకానున్నారు. దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటును ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో సెక్యూరిటీని టైట్ చేసినట్లు సమాచారం.