తెలంగాణకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష : కేసీఆర్

-

కోదాడకు కాళేశ్వరం నీళ్లు తెస్తామన్నారు కేసీఆర్. కోదాడలో బీసీ చైతన్యం కనిపించాలి. పాదయాత్రలో బావులు తవ్వుతున్న బాధను చూసి చలించిపోయాను. ప్రజాస్వామ్యంలో ఓటును మించిన శక్తి లేదు. కాంగ్రెస్ వస్తే మళ్లీ కరెంట్ కోతలు, కారు చీకట్లేనని పేర్కొన్నారు.
తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.

తాను మాట్లాడేంత వరకు నీటి హక్కుల గురించి ఎవ్వరూ మాట్లాడలేదని చెప్పారు. పంట పొలాలకు సంపూర్ణంగా నీరు అందించే బాద్యత తనదేనని పేర్కొన్నారు. తిరిగి అధికారంలోకి వస్తే రూ.10కోట్లతో కోదాడతో బీసీ భవన్ నిర్మిస్తామన్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తే కోదాడకు నీటి కొరత ఉండదని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు సిగ్గులేకుండా అబద్దాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాకముందు సాగర్ నీళ్ల కోసం రైతులు నా దగ్గరికీ వచ్చారు. 24 గంటలు రైతులకు నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చామని గుర్తు చేశారు కేసీఆర్. ఓటు చేతిలో బ్రహ్మాస్త్రం. పంటపొలాలు, ఎండాలా..? పండాలా అనేది మీ ఓటు నిర్ణయిస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version