ప్రజల పక్షాన నిలిచిన బీఆర్ఎస్.. ఈ సెషన్స్ వెరీ స్పెషల్ : ఎమ్మెల్సీ కవిత

-

అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులు,ఎస్సీ వర్గీకరణ బిల్లు ఈ సెషన్‌లోనే ఆమోదం పొందాయని..వాటి అమలుకు బీఆర్ఎస్ ఎంతో కృషి చేసిందన్నారు. శుక్రవారం మండలి మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆమె మాట్లాడారు.

కవిత మాట్లాడుతూ..రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు ప్రచారం బయటపడిందన్నారు. అప్పులు మొత్తం రూ.4 లక్షల 42 వేలు అని పార్లమెంటులో కేంద్రం ప్రకటించిందన్నారు.కానీ, సీఎం రేవంత్ మాత్రం గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశారని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.మండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ నిలిచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినట్లు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news