ఏప్రిల్ 19 నుంచి రాహుల్ అమెరికా పర్యటన వెళ్లనున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏప్రిల్ 19 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. బ్రౌన్ యూనివర్సిటీని రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. బోస్టన్‌లో ప్రవాస భారతీయులతో భేటీ అవుతారని తెలుస్తోంది.

2024 సెప్టెంబర్‌లో మూడు రోజుల పాటు అమెరికాలో రాహుల్ గాంధీ పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తన నియోజకవర్గమైన దుబ్బాకలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిని కోరినట్లు సమాచారం. దుబ్బాక ఎమ్మెల్యే వినతిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.యూనివర్సిటీ కోసం కావాల్సిన స్థల పరిశీలనకు దుబ్బాక వెళ్లాలని సీఎంఓకు ఆదేశాలు కూడా జారీ చేశారని టాక్.