బండి-బాబుపై బీఆర్ఎస్ ఫైర్..కోచ్ ఫ్యాక్టరీకి హ్యాండ్.!

-

తెలంగాణలో బీజేపీ-బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పైగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సైతం తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీకి సపోర్ట్ ఇవ్వడానికే వచ్చారని విమర్శలు వస్తున్నాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలతో పాటు బాబుని కూడా టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ రైతు ధర్నాలు చేయడంపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది.

అదేవిధంగా తాజాగా కేంద్రం..తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో హ్యాండ్ ఇచ్చింది.  రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దాన్ని ఏర్పాటు చేయలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇలా కేంద్రం నుంచి సమాధానం రావడంతో బీఆర్ఎస్‌ నేతలు బీజేపీపై ఫైర్ అవుతున్నారు.

కోచ్ ఫ్యాక్టరీ విషయంలో ఎవరిది తప్పో భద్రకాళి అమ్మవారి సాక్షిగా తేల్చుకుందామని బండి సంజయ్కు..ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ సవాల్ విసిరారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యాఖ్యలు తమ గుండెపగిలిపోయేలా చేశాయన్నారు. ప్రజలంతా మరో పోరుకు సిద్ధమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

అటు చంద్రబాబుని సైతం వినయ్ టార్గెట్ చేశారు..స్వరాష్ట్రంలో తాము సాధించుకున్న వనరులను దోచుపోవడానికి చంద్రబాబు కొత్త కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బీజేపీ, బాబు టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే కోచ్ ఫ్యాక్టరీ విషయాన్ని బీఆర్ఎస్ బాగా సీరియస్ గా తీసుకుంది. ఈ అంశంలో బీజేపీని ఇరుకున పెట్టేలా ముందుకెళ్లనున్నారు. దీనిపై దశల వారీగా పోరుకు సిద్ధమవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version