వీరసింహారెడ్డి “మా బావ మనోభావాలు” ఐటమ్ సాంగ్ రిలీజ్

-

స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న సరికొత్త చిత్రం వీరసింహారెడ్డి. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ చిత్రంలో దునియా విజయ్ విలన్ గా నటిస్తున్నారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, చంద్రిక రవి, పి రవిశంకర్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ జనవరి 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస అప్డేట్లతో మూవీపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది చిత్రం బృందం. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన జై బాలయ్య మాస్ ఆంథమ్, సుగుణ సుందరి సాంగ్స్ సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశాయి.

తాజాగా ఈ చిత్రం నుంచి మరో మాస్ సాంగ్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ” మా బావ మనోభావాలు” అంటూ సాగే మాస్ ఐటమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో బాలయ్య తన స్టెప్పులతో ఇరగదీశారు. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version