BRS Working President KTR to Charminar: బీఆర్ఎస్ పార్టీ పెను సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అధికారిక చిహ్నం మార్పిడిపై నేడు బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేయనుంది. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి చారిత్రక చిహ్నాలు చార్మినార్, కాకతీయ కళాతోరణం తొలగించడంపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకుంది బీఆర్ఎస్ పార్టీ.

చార్మినార్ చిహ్నం తొలగింపుపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఉదయం 10.30 గంటలకు చార్మినార్ వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీంతో.. చార్మినార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.