బీజేపీతో ఉన్న ఫెవికాల్ బంధాన్ని బలపర్చుకోడానికే టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు శ్రమించారని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. ఆఖరి మూడు, నాలుగు రోజుల్లో రెండు పార్టీలు కలుపుకొని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని అనుకుంటున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన వెల్లడించారు.
గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను వివరించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పనిచేశాయని, అందుకే కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని మంత్రి వివరించారు. అంతేకానీ, ప్రజలు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదని ఆయన స్పష్టంచేశారు.