చైనాను వణికిస్తున్న మరో వైరస్‌..ఆందోళనలో ప్రపంచ దేశాలు..!

-

మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా తయారైందని చైనా పరిస్థితి..ఇప్పటికే కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రపంచం ముందు దోషిగా నిలబడ్డ డ్రాగన్‌ కంట్రీ ఇప్పుడు మరో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..ఇప్పటికే కరోనా వైరస్‌ ప్రభావం వల్ల ప్రపంచం బాధపడుతోంది.. వైరస్ కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి పరిశోధకుల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ..ప్రజలకు అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా కాలం పట్టే అవకాశాలు ఉన్నాయి..కరోనావైరస్‌ను విజయవంగా ఎదుర్కొన్న దేశంలో డ్రాగన్‌ కంట్రి ఆగ్ర భాగంలో ఉంది..చైనా లోని వుహాన్ నగరం నుంచి విస్తరించి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇంకా అదుపులో రాలేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ అంటూ భయపెడుతోంది.

తాజా నివేదికల ప్రకారం, బ్రూసెలోసిస్ అనే వ్యాధి చైనాను భయపెడుతుంది..ఈ బ్యాక్టిరియాతో ఇప్పటి వరకు వాయువ్య చైనాలో 6,000 మందికి సోకిందని..ఈ వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కీలక ప్రకటన చేసింది.. బ్రూసెలోసిస్, బ్రూసెల్ల అనే బ్యాక్టీరియా అనేక జాతుల వల్ల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుందని ప్రకటన చేసింది. ఈ బ్యాక్టిరియా జంతువులతో ప్రత్యక్ష సంబంధం ఉంటే ఈ వ్యాధి సోకుతుంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం, త్రాగటం ద్వారా లేదా గాలిలో బ్యాక్టిరియా పీల్చడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించనుంది. ఫ్లూలో కన్పించే లక్షణాలే ఈ వ్యాధిలో కూడా కన్పిస్తాయి. కొందమందిలో ఈ లక్షణాలు దీర్ఘకాలికంగా మారి.. ఇక ఎప్పటికీ తగ్గకపోవచ్చనేది వైద్యులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version