రోజు రోజుకి అమ్మాయిలమీద అఘాయిత్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఏ క్షణంలో ఎటువంటి వార్తను వినాల్సి వస్తుందో అని భయపడుతున్నాము. ఇక తాజాగా తెలుస్తున్న సమాచార ప్రకారం దేశ రాజధాని ఢిల్లీ లో భయంకరమైన ఘటన చోటు చేసుకోవడం అందరినీ బాధకు గురి చేస్తోంది. ఢిల్లీ లోని రోహిణి అనే ప్రాంతంలో ఒక యువకుడు 16 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయిని అతి దారుణంగా కడతేర్చాడు. అయితే ఈ దుర్ఘటనకు కారణం ప్రేమ అయి ఉండచ్చని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరగడానికి కొద్ది సమయం వీరిద్దరి మధ్యన కొంత గొడవ పెనుగులాట జరిగినట్లుగా అక్కడ సీసీటీవీ పుటేజ్ ను బట్టి తెలుస్తోంది. ఇతను అమ్మాయిని ఏకంగా 40 సార్లు కత్తితో పొడిచి, ఆ తర్వాత బండరాయి తీసుకుని తలపై మోది చంపేశాడు.