బీటెక్ విద్యార్థి ప్రశాంత్‌ను హత్య కేసులో ట్విస్ట్…వెనుక ఉన్నది ఓ యువతి ?

-

బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ హత్య కేసులో ట్విస్ట్‌ నెలకొంది. బాలాపూర్ లో బీటెక్ విద్యార్థి ప్రశాంత్ ను హత్య చేసింది స్నేహితులగా గుర్తించారు స్థానిక పోలీసులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. బాలాపూర్ చౌరస్తా హోటల్ 37 వద్ద ప్రశాంత్ ముగ్గురు స్నేహితులు కత్తితో పొడిచి హత్య చేశారని పోలీసులు ప్రకటించారు.

BTech student Prashanth was killed by the police

ఈ మేరకు ముగ్గురు నిందితులని పట్టుకోవడానికి ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు మహేశ్వరం డిసిపి సునీతా రెడ్డి. మృతుడు ప్రశాంత్ నిందితులు ముగ్గురు ఒకే బస్తీలో నివాసం ఉంటున్నట్టు గుర్తించారు పోలీసులు.. ఓ యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్ హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. హత్య చేసి పరారైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ హత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు పోలీసులు. కాగా 15 రోజుల్లోనే బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు హత్యలు జరిగిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news