ఇటలీలోని సిసిలీ వద్ద విలాసవంతమైన సూపర్ యాట్ సెయిల్‌బోట్ సముద్రంలో బోల్తాపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు మరణించారు. ఈ షిప్లో ప్రయాణించిన మోర్గాన్ స్టాన్లీ బ్యాంక్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ జొనాథన్ బ్లూమర్ గల్లంతయిన విషయం తెలసిందే. అయితే ఆయన మృతి చెందినట్లు అధికారులు నిర్ధరించారు. బ్లూమర్తో పాటు ఆయన సతీమణి జూడీ, అటానమీ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు మైక్ లించ్ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గజ ఈతగాళ్లు వీరి మృతదేహాలను వెలికితీశారు.
56 మీటర్ల పొడవున్న బేజియన్ అనే విలాసవంతమైన పడవలో మొత్తం 22 మంది ప్రయాణించగా.. సోమవారం తీవ్రమైన సుడిగాలి వల్ల పడవ బోల్తా పడింది. ప్రమాదం నుంచి 15 మందిని సురక్షితంగా బయటపడ్డారు. మరికొంత మంది గల్లంతు కాగా వారి కోసం గాలిస్తున్న అధికారులు ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. అయితే ఓ సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించారన్న కేసులో మైక్ లించ్ నిర్దోషిగా తేలడంతో.. సన్నిహితులతో కలిసి ఆయన ఈ ట్రిప్‌ను ప్లాన్ చేశారు. బ్లూమర్ ఈ ేసులో సాక్షిగా ఉండటం గమనార్హం.