సంచలనం సృష్టిస్తున్న బుచ్చి బాబు రెమ్యూనరేషన్..!!

-

ఉప్పెన సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సాన. ఆ సినిమా తో ఆయన వంద కోట్ల క్లబ్ లో కూడా అడుగుపెట్టాడు. కాని తర్వాత సినిమా ఏది కూడా మొదలు కాలేదు. చాలా రోజులుగా  ఎన్టీఆర్ చూట్టూ తిరిగిగాడు.  కానీ అనూహ్యంగా ఇప్పుడు రామ్‌ చరణ్ సినిమా ఉందని అధికారిక ప్రకటన వచ్చింది. దీనితో చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ వస్తున్న బుచ్చి బాబు కూడా సినిమా ఓకే కావడంతో ఆనందంగా ఉన్నాడు.

శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే  బుచ్చి బాబుతో రామ్‌ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతాడు. రామ్ చరణ్ సార్ తో నా తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటిస్తున్నందుకు చాలా విలువైన అవకాశం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని కూడా చెప్పాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించిన ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. బుచ్చిబాబు ఈ సినిమా కోసం భారీ రికార్డు స్థాయిలో రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నారట. ఈ ఒక్క సినిమా కోసం బుచ్చిబాబు ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండవ సినిమాకే బుచ్చి బాబు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవటం అంటే ఇది పరిశ్రమ లో సరికొత్త రికార్డ్ అంటున్నారు.ఇక అడ్వాన్స్ కూడా అందుకొని వెంటనే పనిలో పడ్డాడు బుచ్చి బాబు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version