తారక్ లైనప్ మూవీస్ డైరెక్టర్స్ మీటింగ్..ఫొటోలు వైరల్

-

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ RRR ఫిల్మ్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ఆయన RRR సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నెల 20న ఆయన బర్త్ డే సందర్భంగా కొరటాల శివతో చేయబోయే NTR30 వ సినిమా ఓపెనింగ్ ఉంటుందని తెలుస్తోంది. కాగా, తారక్ నెక్స్ట్ లైనప్ మూవీస్ అన్ని కూడా మామూలుగా లేవు.

తారక్-కొరటాల శివ ప్రాజెక్టు తర్వాత ‘కేజీఎఫ్ 2, సలార్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నారు. ఈ విషయమై ఆల్రెడీ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కాగా, తర్వాత చేయబోయే పిక్చర్ ‘‘ఉప్పెన’’ దర్శకుడు బుచ్చి బాబా సానాతో ఉండబోతుందట.

దర్శకుడు బుచ్చిబాబు సానా ..తారక్ కోసం స్టో్రి రాసుకుంటున్నట్లు చాలా రోజుల నుంచి చెప్తున్నాడు. ఈ క్రమంలోనే తారక్ కు ఇటీవల స్టోరి వినిపించాడని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్. అదే నిజమైతే కనుక ..ఇక తారక్ లైనప్ మూవీస్ అన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ్లాస్టర్సేనని తారక్ అభిమానులు. తాజాగా ప్రశాంత్ నీల్ ను దర్శకుడు బుచ్చిబాబు సానా కలిశాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అది బాగా వైరలవుతోంది.

NTR 31, NTR 32 ఫిల్మ్స్ డైరెక్టర్స్ అంటూ తారక్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలో ‘సలార్’ షూట్ లో పాల్గొననున్నాడు. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా..క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు అన్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version