పుట్టగొడుగుల సాగులో అద్భుతాలు సృష్టించిన యువరైతు..

-

ఎంత చదువు చదువుకున్న కూడా మంచి జీతాలు రావడం లేదు..కొన్ని కంపెనిలు అనుభవం అడిగితే, మరి కొన్ని కంపెనీలు ఏదొక సబ్జెక్ట్ పై నైపుణ్యం కలిగి వుండాలని కోరుతున్నారు..చాలామంది ఉద్యోగాలు చేసే ఓపిక లేక వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు.అలా చాలా మంది వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలను సాధించి చూపించారు.ఇది నిజంగా గ్రేట్.. ఇప్పుడు ఓ యువ రైతు కూడా వ్యవసాయాన్ని ఎంచుకోని లక్షలను అందుకుంటున్నాడు. అతను తన బడ్జెట్ లో పుట్టగొడుగులను పండించి అందరి చేత భళా అనిపించుకున్నారు.

 

 

శ్రీకాకుళం జిల్లాలోని వాకలవలస గ్రామానికి చెందిన యువరైతు గౌతమ్. మొదట అవగాహన లేమితో తడబడ్డాడు. సమస్యకు కారణమేంటో తెలుసుకున్నాడు.ఎలాగైనా పడిన చోటే లేచి నిలబడాలన్న నిర్ణయానికి వచ్చాడు.డబ్బులు సంపాదించాలనే తపనతో మరో అడుగు ముందుకు వేశాడు. ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు. చిన్న పెట్టుబడితో పెద్ద మొత్తంలో లాభాలను గడిస్తున్నారు.కేవలం రెండున్నర లక్షల రూపాయల పెట్టుబడితో పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రారంభించాడు గౌతమ్. సీజన్‌ వారీగా వచ్చే వాతావరణ మార్పులను అనుసరించి రెండు రకాల పుట్టగొడుగులను పెంచుతున్నాడు. 6 నెలలు ముత్యపు చిప్ప పుటట్టగొడుగులో మరో ఆరు నెలలు మిల్కీ మష్‌రూమ్స్‌ పెంపకం చేస్తున్నాడు.

 

మొదట కాస్త ఇబ్బందులను ఎదుర్కున్నా కూడా ఇప్పుడు నెలకు అన్నీ ఖర్చులు పోగా 60 వేలు ఆదాయాన్ని అందుకుంటున్నాడు.కొత్తగా వచ్చేవారు తక్కువ పెట్టుబడితో పెంపకం మొదలుపెట్టాలన్నారు. ప్రారంభంలో నష్టాలు ఎదురైనా ఏమాత్రం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని రైతు తన అనుభవపూర్వకంగా తెలిపాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పుట్టగొడుగుల పెంపకం ద్వారానే లభిస్తుందన్నాడు. ఇప్పుడు తన తల్లి దండ్రులు కూడా అతనికి తొడయ్యారు..ఏదైనా ఆలోచన , పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు..

Read more RELATED
Recommended to you

Exit mobile version