విజయసాయి గజ దొంగ, నర రూప రాక్షకుడు..బహిరంగ ఉరి వేయాలి – బుద్ధా వెంకన్న

-

విజయసాయి గజ దొంగ, నర రూప రాక్షకుడు అని బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రకు శని లా దాపురించాడని.. పన్నెండు 420 కేసులు కలిగిన వ్యక్తి అని విజయ సాయిరెడ్డి పై నిప్పులు చెరిగారు. మూడు జిల్లాలలో భూములను బినామిలతో కాజేస్తున్నాడని..1500 కోట్లు కలిగిన ఎన్ సి సి భూములు ను 200 కోట్ల కు బినామీ లతో దోచేసాడని ఆరోపించారు.

ఉత్తరాంధ్ర కి విజయసాయి రెడ్డి తానే రాజు తానే మంత్రి గా వ్యవహరిస్తున్నాడని… ఉత్తరాంధ్ర లో వీజే టాక్స్ వేస్తున్నాడు.. ఒకటి జగన్ కి, మరొకటి విజయ సాయి రెడ్డికి ఉందన్నారు. రాష్ట్రం అంతా విజయ సాయి రెడ్డి పేరు చెప్తే వణికి పోతున్నారని.. మేము అసత్య ఆరోపణలు చేస్తే దమ్ముంటే మమ్మల్ని పీకించు అని సవాల్‌ విసిరారు. విజయసాయి రెడ్డి అవినీతి గురించి ఏప్రిల్ 21 న సర్వే నెంబర్ లతో సహా వైజాగ్ పార్టీ ఆఫీస్ లో చెప్తానని హెచ్చరించారు.

ఏప్రిల్ 21 న జగదాంబ సెంటర్ దగ్గర బహిరంగ చర్చకు విజయ సాయి రెడ్డి సిద్దమా అని సవాల్‌ విసిరారు. ప్రజా సమస్యలు పై పోరాడితే తప్పుడు కేసులు పెట్టారు.. వేరే దేశంలో అయితే విజయ సాయి రెడ్డి ని బహిరంగ ఉరి వేసేవారని నిప్పులు చెరిగారు. 16 నెలలు జగన్, విజయ సాయిరెడ్డి క్లాస్ మేట్స్ గా ఉన్నారు.. అందుకే సమానము గా పంచుకుంటున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version