మునుపు ఎన్నడూ చూడని విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తూనే వచ్చారు. అనుకున్నట్లే.. కరోనా నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ కనీ వినీ ఎరుగని రీతిలో ఉంది. ఈ బడ్జెట్ తో సామాన్యుడికి ఏ లాభం లేదని తేలిపోయింది. ఇక కొత్తగా ఈ బడ్జెట్‌లో అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ సెస్‌ను కూడా విధించారు. దీంతో కొన్ని ఉత్పత్తులు ధరలు పెరుగనున్నాయి. అయితే ఈ బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువుల మీద భారీగా ధరలు పెరుగనున్నాయి. మరికొన్నింటిమీద నామమాత్రంగా ధరలు తగ్గనున్నాయి. ఆ లిస్ట్ లో ముఖ్యంగా చెప్పుకోవలసినవి..
ఇకనుంచి ధరలు పెరుగనున్నవిః
ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్స్, చార్జర్లు, లెదర్ షూలు, పప్పు దినుసులు, ఆటోమొబైల్ విడి భాగాలు, రత్నాలు, సోలార్ ఇన్వర్టర్లు, ముడి పామాయిల్, ఎల్ఈడీ బల్బులు, సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్, యాపిల్స్, రిఫ్రిజిరేటర్లు, ఏసీల కంప్రెషర్లు, ముడి సిల్క్, కాటన్, ఇంక్ క్యాట్రిడ్జ్‌లు మొదలైన వాటి ధరలు ఆకాశాన్ని అంటనున్నాయి.
ధరలు తగ్గనున్నవిః
ఐరన్, స్టీల్, నైలాన్ బట్టలు, కాపర్ వస్తువులు, ఇన్సూరెన్స్, విద్యుత్తు, డ్రై క్లీనింగ్, వ్యవసాయ పరికరాల మీద కొంత ధర తగ్గనుంది.